జోరుజోరుగా వర్షాలు…!

floods పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నిండుతున్న ప్రాజెక్టులు

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రూ.5 కోట్లు నష్టం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఐదురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వైరా నది ఉద్ధృతితో జాలిముడి ప్రాజెక్టులో ముగ్గురు చిక్కుకున్నారు. ముగ్గురు వ్యక్తులను రక్షించేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీనది పొంగిపొర్లుతుంది. వరదల వల్ల బీబీనగర్ మండలంలోని భట్టుగూడెం-పెద్దిరావులపల్లి, మక్త అనంతాపురం-పిలాయిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

kmm floodవరంగల్ జిల్లాలో పడుతున్న వానలకు మోరంచ వాగు అడ్డుఅదుపులేకుండా ప్రవహిస్తోంది. ధర్మారావుపేట-ఘన్‌పూర్ మధ్య ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి-పరకాల రహదారిపై వరదనీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 30 మండలాల్లో ముసురు అలముకుంది. ఆదిలాబాద్‌లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్‌లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 5 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు సమాచారం. తిర్యాణి మండలంలో వర్షాలతో కిరిగూడ, డోర్లి-1, డోర్లి-2 ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. కాగజ్‌నగర్ మండలంలో కురుస్తున్న వర్షాలకు జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. సిర్పూర్(టి), బెజ్జూరు మండలాల్లో వర్షాలతో కుక్కుడ, రేచిని, కృష్ణపల్లి వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy