టాపర్ తెలంగాణ విద్యార్థి : సివిల్స్ తుది ఫలితాలు విడుదల

UPSCసివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్‌ వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్‌-2017 మెయిన్స్‌ తుది ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్-27) విడుదలయ్యాయి.

ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (UPSC) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌ సైట్  www.upsc.gov.in లో పొందుపరిచింది.  2017 జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించింది UPSC. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ను  నిర్వహిస్తోంది UPSC. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన UPSC  తుది ఫలితాలు విడుదల చేసింది.

ర్యాంకు   టాపర్లు 
1       దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌ పల్లి)
43     శీలం సాయితేజ
100    నారపురెడ్డి శౌర్య
144    మాధురి
195    వివేక్ జాన్సన్
624    వై అక్షయ్ కుమార్
816    భార్గవ శేఖర్

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy