టాప్ త్రీలో హైదరాబాద్

hyderabad ఆఫీసు సముదాయాల గిరాకీలో దేశంలోనే మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ నగరం చేరిందని వెల్లడించింది సీబీఆర్‌ఈ దక్షిణాసియా తాజా నివేదిక. హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు చెందిన సంస్థలు దాదాపు 40 శాతం ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయని పేర్కొంది సీబీఆర్‌ఈ.  2017 తొలి త్రైమాసికంతో పోల్చితే ఆఫీసు సముదాయాల గిరాకీలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో 28 శాతం వృద్ధి చెందింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్థికసంస్థలు, పరిశోధన, కన్సల్టింగ్, అనలిటికల్ కార్పొరేట్ సంస్థలున్నాయని వెల్లడించింది ఆ నివేదిక. ప్రధానంగా మధ్యస్థాయి నుంచి బడా సైజు స్థలాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఐటీ కంపెనీలు రాయదుర్గం, ఐటీ కారిడార్‌లలో స్థలాన్ని తీసుకోగా, ఎర్రమంజిల్, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ఐటీయేతర సంస్థలు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆఫీసు అద్దెలు ఇటీవల విపరీతంగా పెరిగాయి.

సుస్థిర ప్రగతి సాధించిన ఆఫీసు మార్కెట్

జీఎస్టీ, రెరా వంటి అంశాలు అమల్లోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో ఆఫీసు మార్కెట్ సుస్థిరమైన ప్రగతిని సాధించిందన్నారు సీబీఆర్‌ఈ చైర్మన్ అంశుమన్ మ్యాగజీన్. ప్రధాన నగరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. 2017 ఏప్రిల్ నుంచి జూన్‌ లోపు హైదరాబాద్‌లో చిన్న, మధ్యస్థాయి సంస్థలే అధిక శాతం ఆఫీసు స్థలాన్ని తీసుకున్నాయన్నారు. వీటి శాతం ఎంతలేదన్నా 90 శాతానికి పైగా చేరిందన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా 60 శాతం ఆఫీసు స్థలాన్ని వివిధ సంస్థలు తీసుకున్నాయని చెప్పారు సీబీఆర్‌ఈ చైర్మన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy