
ఇక ఇండివిజువల్ ర్యాకింగ్స్ లో ధోనీ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శిఖర్ ధవన్ 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 20వ ర్యాకు తో టాప్ 20 లో చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో 5వ ర్యాంకుతో రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ టెన్ లో ఉన్నాడు. పాక్ బౌలర్ సయీద్ అజ్మల్ తొలి స్థానాన్ని దక్కించుకోగా, స్టెయిన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్లలో పాక్ ప్లేయర్ హఫీజ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో శ్రీలంక ప్లేయర్ మ్యాథ్యూస్ కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.