టాలీవుడ్ మెగామూవీలో బాలీవుడ్ మెగాస్టార్..?

chiru-amitabమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’లో చిరుతోపాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందుకోసం ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా అమితాబ్ ను కోరారట. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్క్రిప్ట్ కూడా బిగ్ బీ చేతిలో పెట్టినట్టు సమాచారం. ఇక అమితాబ్ నుంచి రిప్లై రావడమే ఆలస్యం.

గతంలో చిరంజీవితో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అమితాబ్ కూడా మళ్లీ చిరు తిరిగి సినిమాల్లోకి వస్తే చూడాలని వుందని కోరుకున్నారు. మరి తాను కోరుకున్న విధంగానే సినిమాల్లోకి వచ్చిన చిరు స్వయంగా కోరుతున్న ఈ కోరికని అమితాబ్ మన్నిస్తారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తే, బాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ ఆ సినిమాను మార్కెటింగ్ చేసుకోవడానికి మార్గం మరింత సుగుమం అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. రామ్ చరణ్ హోం బ్యానర్‌పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy