టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

virat-kohli-jasonనార్త్ సౌండ్ అంటిగ్వా వేదికగా …భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటి వరకు కనీసం ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. కనీసం ఈ వన్డేలోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ఈ వన్డేలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది ఇండియా. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ఆదిక్యంతో కొనసాగుతోంది.

కెప్టెన్ విరాట్ కోహ్లి తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. యువరాజ్ సింగ్ స్థానంలో దినేశ్ కార్తీక్, అశ్విన్ స్థానంలో జడేజా, భువనేశ్వర్‌కి బదులుగా మహ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నాడు.

భారత్ జట్టు: అజింక్య రహానె, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy