టికెట్స్ కి ఫుల్ డిమాండ్ : న్యూఇయర్ పార్టీలు దుమ్ముదుమారమే

new-year

మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరం. 2017కి వీడ్కోలు పలుకుతూ.. 2018కి వెల్ కమ్ చెప్పటానికి అప్పుడే ప్రిపరేషన్స్ ఊపందుకున్నాయి హైదరాబాద్ సిటీలో. న్యూఇయర్ పార్టీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే అన్ని ఈవెంట్ వెబ్ సైట్స్ లో న్యూఇయర్ పార్టీ వివరాలతోపాటు ప్యాకేజీలు ప్రకటించేశాయి. ఆశ్చర్యకరంగా కొన్ని పార్టీలకు నో టికెట్స్ అని దర్శనం ఇవ్వటం విశేషం.

హైదరాబాద్ లోని బార్లు, పబ్స్, రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, స్టేడియాల్లో ఏర్పాటు చేసే న్యూఇయర్ పార్టీలకు ఇప్పటి నుంచే ఫుల్ గిరాకీ మొదలైంది. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కావటంతో బాగా కలిసి వచ్చింది. సింగిల్, కపుల్, ఫ్యామిలీ ప్యాకేజీలతో ఆఫర్స్ ఇస్తున్నాయి. హైదరాబాద్ లో న్యూఇయర్ పార్టీ సింగిల్ టికెట్ రూ.1000 (వెయ్యి) కనీసంగా ఉంది. కపుల్ ప్యాక్ అయితే రూ.2వేలు మినిమమ్. కొంచెం హై క్లాస్ అయితే మాత్రం కనీసం రూ.4వేలుగా ఉంది. అత్యధికంగా ఒక్కో కపుల్ ప్యాక్ రూ.15వేలు ఉంది. రూ.2వేల కపుల్ ప్యాక్ లో అయితే లిమిటెడ్. అదే అన్ లిమిటెడ్ ప్యాక్ కావాలంటే మాత్రం ఒక్కో కపుల్ ప్యాక్ రూ.5వేలు నుంచి మొదలవుతుంది.

NYE 2018 పేరుతో ఇప్పటికే 45 ఈవెంట్స్ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ 45 పార్టీల నుంచి లక్ష టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫైస్టార్ హోటల్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ లో అయితే ఇప్పటికే VVIP టికెట్స్ బుకింగ్ క్లోజ్ అయిపోయింది. జనరల్ టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీలు వీకెండ్ రావటంతో గత ఏడాదితో పోల్చితే ఫాస్ట్ గా టికెట్ బుకింగ్ జరిగిందని చెబుతున్నారు ఈవెంట్ మేనేజర్లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy