టిబెట్ వరదల్లో కొట్టుకు పోయిన భవనం

Building-collapsesటిబెట్‌ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు ఓ ఐదంతస్తుల బిల్డింగ్ పేకమేడలా కుప్ప కూలిపోయింది. పునాది నానిపోయిన ఆ భవంతి కూలే ప్రమాదం ఉండటంతో ముందస్తుగానే ఆ బిల్డింగ్ లో ఉన్నవారిని ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. ఈ వరదల్లో చూస్తుండగానే రోడ్డుమీద పార్క్ చేసిన ఓ ట్రక్ కూడా కొట్టుకుపోయింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy