టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఇతల పార్టీల నుంచి వచ్చిన వారే..!!

kcr imageఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో తన రూటే సెపరేటని రుజువు చేశారు.. సీఎం కేసీఆర్.  సొంత పార్టీ లీడర్లను పక్కనపెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే ఎమ్మెల్సీ బరిలో నిలిపారు. తనను నమ్ముకుని వస్తే.. ఫ్యూచర్ కు ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. ఫైనల్ గా కారెక్కుతున్నవాళ్లను ఆపలేక పరేషాన్ అవుతున్న చంద్రబాబు శిబిరానికి.. నిద్రపట్టనీయకుండా చేశారు కేసీఅర్. నేను మొండోన్ని.. మాట ఇవ్వనే ఇవ్వ.. ఇస్తె.. తల నరుక్కుంటగానీ మాట తప్ప. ఇదీ కేసీఆర్ మార్క్ డైలాగ్. దాన్నే ఇంప్లిమెంట్ చేసి చూపారు కేసీఆర్. పార్టీలో ఎందరో ఆశావహులున్నా.. అందరినీ పక్కన పెట్టేశారు. వత్తిడులు ఎన్నున్నా డోంట్ కేర్ అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో తనను నమ్ముకుని వచ్చిన ఇతర పార్టీ నేతలకే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫమ్ చేశారు. ఫ్యూచర్ లో పార్టీలోకి వచ్చేవాళ్లకు ఇండైరెక్ట్ గా రూట్ క్లియర్ చేశారు కేసీఆర్.

ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన వారిలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావుల రాజకీయ జీవితం.. టీడీపీతో మొదలైంది. మంత్రులుగానే కాకుండా, పార్టీ పదవుల్లో కీరోల్ ప్లేచేశారు. మారిన రాజకీయ పరిణామాల్లో కారెక్కారు. కడియంకు డీప్యూటీ సీఎం, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారు కేసీఆర్. ఆర్నెల్లలో సభకు ఎన్నిక కావాల్సిన టైమ్ లో ఎమ్మెల్సీలుగా బరిలో నిలిపారు. కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎదిగారు నేతి విద్యాసాగర్. నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల అభ్యర్థిగా రెండుసార్లు మండలికి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఫామ్ లోకి రాగానే రూట్ మార్చారు. మండలి వైస్ చైర్మన్ పదవిలో ఉండి.. పార్టీలోకి వచ్చినందుకు కృతజ్ఞతగా.. మరోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్. మరో అభ్యర్థి యాదవరెడ్డిది కూడా సేమ్ సీన్. మండలిలో కాంగ్రెస్  వాయిస్ వినిపించిన యాదవరెడ్డి.. కారెక్కేశారు. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ సీటు టీఅర్ఎస్ కు దక్కటంలో కీరోల్ ప్లేచేశారు.. ఫలితంగా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు కేసీఆర్.

టీడీపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం బోడకుంటి వెంకటేశ్వర్లు సొంతం. వరంగల్ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు.. పార్టీ తరఫున ఎంపిటీసీ నుంచి ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తూనే.. ఆ పార్టీ శాసనమండలి పక్షాన్ని టీఅర్ఎస్ లో కలుపుతున్నామని చైర్మన్ కు లేఖ రాసారు. అందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యారు బోడకుంటి. అభ్యర్థుల ఎంపికపై వస్తోన్న విమర్శలను తిప్పికొడుతున్నారు పార్టీ నేతలు. విపక్షాలది అనవసర రాద్ధంతమని కొట్టిపారేస్తున్నారు. ప్రసెంట్ టైమ్ లో పార్టీపై పార్టీ అధ్యక్షుడిపై భరోసా కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు కేసీఆర్. ఫ్యూచర్ లో పార్టీలోకి వచ్చే ఆశావహులకు ఇది మంచి సంకేతమవుతుందని భావిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy