టీఆర్ఎస్ ప్లీనరీ : వేదికకు ప్రగతి ప్రాంగణం పేరు

trs-plenary-2018ఎల్లుండి ఏప్రిల్ 27వ తేదీన కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్ లో జరనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఈటెల, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఇతర ప్రముఖులు. ఈ సందర్భంగా అంబలి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. రాబోయే ఎన్నికల ముందు జరుగుతున్న ప్లీనరీ కావటంతో.. కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పారు మంత్రి ఈటెల. 2019లోనూ గెలుపు TRS పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ – ప్రభుత్వం రెండూ సమానమే అన్నారు. ప్రజల మద్దతు ఎప్పటికీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ కే ఉంటుందన్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy