అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

GOVERNER IMAGEఅసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగంలో భాగంగా తెలంగాణ కోసం ఎంతో మంది మృతి చెందారని, అమరుల త్యాగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. అమరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇవ్వనున్నట్లు ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ అవినీతిని నిర్మూలించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న అంశాల ఆధారంగా గవర్నర్ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగంలోని మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ :

  • పేదలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతాం
  • మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు
  • వికలాంగులకు 1500, వృద్ధులకు, వితంతువులకు 1000 రూపాయల పెన్షన్
  • తండాలను పంచాయితీల్లో చేర్చుతాం
  • ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు..
  • మూడు లక్షలతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
  • ఆటోలకు నో ట్యాక్స్..
  • గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రతేక వింగ్
  • బీడీ కార్మికులకు నెలకు వెయ్యి పెన్షన్..
  • మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు..
  • నిజామాబాద్ జిల్లాలో షుగర్ కేన్ ఇండస్ట్రీ
  • విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఇన్ పుట్ సబ్సిడీ..
  • విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు
  • చెరువులు, కుంటల మరమ్మత్తు
  • హైదరాబాద్, వరంగల్ లో ఇండస్రటియల్ కారిడార్
  • తండాలను పంచాయితీలుగా మార్పు
  • ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు
  • ప్రతి నియోజక వర్గంలో నిమ్స్ తరహా హాస్పిటల్స్
  • హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ప్రత్యేక ఏర్పాటు
  • మూసీ నది ప్రక్షాళన
  • 104, 108 సర్వీసుల కొనసాగింపు
  • పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం
  • 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు
  • జర్నలిస్టుల సంక్షేమానికి 10 కోట్లు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy