టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు..

KCR1 KCR2 KCR3 KCR4శాసన మండలి ఛైర్మన్ పదవి ఎట్టి పరిస్థితిలో దక్కించుకోవాలన్న కసితో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ కింద ఇద్దరు ఎమ్మెల్యేలను, 9 మంది ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్పీకి చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, మెదక్ కాంగ్రెస్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లతో పాటు టిడిపి ఎమ్మెల్సీలు డి.వెంకటేశ్వర్లు, సలీం లు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు పూల రవీందర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, సంజీవరెడ్డి, ఎన్.రాజలింగం, భానుప్రసాద్ రావు లు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన భాను ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ అపార కృషి  ఉందన్నారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. సీనియర్ నేత ఆమోస్ ఆమోస్ మాట్లాడుతూ.. 69 లో 350 మంది మృతి.. తర్వాత 1200 మంది మృతి చెందారన్నారు. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలంటే.. శత్రు శేషం లేకుండా చేయాలంటే.. టీడీపీ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాంటే.. కేసీఆరే కరెక్టని అన్నారు. ఆంధ్రా నేతలు చేస్తున్న కుట్రలను కేసీఆర్ అడ్డుకోగలరన్నారు. సాగర్ నుంచి 10 టీఎంసీలు డిమాండ్ చేస్తే.. 3.5 టీఎంసీలే ఇచ్చి విజయం సాధించారన్నారు. గురుకుల ట్రస్టు భూములను కేసేఆర్ ధైర్యానికి అభినందనలు తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామ్నారు. టీడీపీ నుండి వచ్చిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరెంటు, నీటి విషయంలో సీమాంధ్రులు కండిషన్లు పెడుతున్నారు, పీపీఏలు రద్దు కుట్ర, పోలవరం.. కార్యకర్త స్థాయి నుండి పనిచేసిన తాము టీడీపీ ని వదలటానికి కారణం బాబు నిర్ణయమేన్నారు. కోనప్ప మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్నారు. పూల రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఘనత కేసీఆర్ దేనని.. నవ తెలంగాణ నిర్మాణం కూడా కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy