టీఎంసీకి పోటీగా… సీపీఎం పోయి బీజేపీ వచ్చింది..!!

bjp_tmc_060214పశ్చిమ బెంగాల్ లో పొలిటికల్ సీన్ మళ్లీ హీటెక్కుతోంది. లాస్ట్ ఇయర్ వరకు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం గా ఉన్న ఆధిపత్య పోరు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత TMC వర్సెస్ BJPగా మారింది. బీర్ భూమ్ లో రెండు పార్టీల మధ్య గొడవలు.. లేటెస్ట్ బాంబ్ బ్లాస్ట్ తో మళ్లీ తెరపైకి వచ్చాయి. బీర్ భూమ్ ఇలాం బజార్ లోని .. తృణమూల్ కాంగ్రెస్ లీడర్ బురో హన్స్ డా ఇంట్లో నాటు బాంబ్ పేలింది. హన్స్ డా తీవ్ర గాయాలతో బయటపడగా ఆయన భార్య చుంకీ… స్పాట్ లోనే చనిపోయారు. బుర్ ద్వాన్ మెడికల్ కాలేజీలో హన్స్ డా మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ ఇన్సిడెంట్ పై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీలోని ప్రత్యర్థులే బాంబ్ దాడి చేశారని టీఎంసీ నేతలు చెబుతుండగా… తృణమూల్ కాంగ్రెస్ నేతలు బాంబ్ లు తయారు చేస్తుండగా పేలాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

దాదాపు వారం రోజుల నుంచి బీర్ భూమ్ లో సేమ్ సిచ్యుయేషన్. పబ్లిగ్గా ఒకరిపై ఒకరు నాటు బాంబ్ లతో దాడి చేసుకున్నారు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు. నాటు తుపాకులతో కాల్చుకున్నారు. పట్టపగలే విరుచుకుపడ్డారు. వరుసగా మూడు రోజుల పాటు అల్లర్లు కంటిన్యూ అయ్యాయి. ఈ గొడవల్లో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ లో కూడా రెండు పార్టీల మధ్య ఇలాంటి గొడవలే జరిగాయి. సివిల్ కాంట్రాక్ట్ వర్క్ లు దక్కించుకునేందుకు, ప్రత్యర్థులను భయపెట్టేందుకు నాటు బాంబ్ లను వాడుతున్నారు లోకల్ లీడర్లు. అక్కడి అధికార పార్టీ త్రుణమూల్ కాంగ్రెస్ నేతల పట్ల పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy