టీఎస్‌పీఎస్సీకి స్కాచ్ అవార్డు ప్రదానం

ghanta chakrapaniతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి స్కాచ్ అవార్డును ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన స్కాచ్ సమ్మిట్ సందర్భంగా ఈ అవార్డును కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అందుకున్నారు.  స్కాచ్ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు ఘంటా చక్రపాణి. ఉద్యోగుల కృషి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని తెలిపారు.  ఈ అవార్డు తమ పనితీరుకు గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణలో మెరుగైన విధానాలు తీసుకొచ్చామన్నారు. భవిష్యత్‌లో ఇంకా మెరుగైన పారదర్శక విధానాలు రూపొందిస్తామన్నారు. డిజిటలైజేషన్‌లో టీఎస్‌పీఎస్సీ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు  చైర్మన్ చక్రపాణి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy