టీచర్లు కారు…మృగాలు : వేధింపులే బాలిక ఆత్మహత్యకు కారణం

noidacase15 ఏళ్ల బాలిక ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగింది. తండ్రిలా  ప్రేమగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే ఆ చిన్నారిని లైంగికంగా వేధించారు. గతంలో ఈ విషయం తన పేరెంట్స్ కు చెప్పిన వారు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది.  టీచర్ల వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు పేరెంట్స్. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న ఆల్కన్ పబ్లిక్ స్కూల్‌లో ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. పరీక్షలో టీచర్లు తక్కువ మార్కులు వేశారని, లైంగికంగానూ తన బిడ్డను వేధించారని తండ్రి ఫిర్యాదు చేశాడు. స్కూల్ టీచర్లు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తన కూతురు ఫిర్యాదు చేసేదని తెలిపాడు ఆ బాలిక తండ్రి. పరీక్ష ఎంత మంచిగా రాసినా, తనను ఫెయిల్ చేస్తారని భయపడేదన్నాడు. తన కూతుర్ని స్కూలే చంపేసిందని భోరున ఏడ్చాడు ఆ తండ్రి. బాలిక ఆత్మహత్యపై పోస్టుమార్టమ్ నిర్వహించనున్నట్లు చెప్పారు డాక్టర్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy