టీచర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

womenక్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుండగానే ఉపాధ్యాయురాలిపై  కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. టీచర్‌ మంటల్లో కాలిపోతూ కేకలేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థుల అరుపులు విని ఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చిన ఇతర టీచర్లు, స్థానికులు ఆ టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాల వల్ల టీచర్‌ సునంద(50)పై ఆమె బిజినెస్ పాట్నర్ ఈ దారుణానికి  పాల్పడినట్లు చెబుతున్నారు పోలీసులు. బుధవారం (ఆగస్టు 16) మధ్యాహ్నం 2 గంటల సమయంలో సునంద అయిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠాలు చెబుతుండగా.. క్లాస్‌రూంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై పెద్దగా అరిచాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

సునంద ఆ వ్యక్తిని క్లాస్ రూం లోనుంచి వెళ్లిపోవాలని గద్దించగా.. అతడు తన వెంట తెచ్చుకున్న డబ్బాను తెరిచి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. ప్రస్తుతం ఆమె 50 శాతం కాలిన గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy