టీమిండియాను మేమే బహిష్కరిస్తాం: పాక్

Miandadతమతో క్రికెట్ సిరీస్ లు ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించని ఇండియా టీంతో పూర్తిస్థాయి సంబంధాలను తెంచుకోవటమే సరైన మార్గమన్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్. భారత్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) నిర్వహించే మ్యాచ్ లను కూడా బాయ్ కాట్ చేయాలని పాక్ క్రికెట్ కు సూచించాడు. అసలు తమతో ద్వైపాక్షిక సిరీస్ లు జరపడానికి భారత్ ను ఒప్పించలేని ICC.. వారు నిర్వహించే టోర్నీల్లో భారత్ తో పాక్ ను ఆడించడానికి ముందుకు రావడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. భారత్ తో మ్యాచ్ లను ఆడకుండా దూరంగా ఉన్నప్పుడే ICC కి తగిన బుద్ది చెప్పినట్లు అవుతుందన్నాడు.

మనం ఎప్పుడైతై భారత్ తో జరిగే ఐసీసీ టోర్నీలకు దూరంగా ఉంటామో.. అప్పుడు ఆ టోర్నీ ఆదరణ కూడా తగ్గుతుందన్నాడు. దాంతో ICCని ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేయొచ్చన్నాడు. అలా చేస్తేనే మనకు తగిన గౌరవం దక్కడమే కాదు.. మన మాటను కూడా ఐసీసీ వినడానికి ముందుకొస్తుందన్నాడు. అంతేకానీ ICCపై స్ట్రైక్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఏమీ సాధించలేమంటూ పాక్ క్రికెట్ కు తెలిపాడు. అంతే కాదు ఐసీసీలో మన మాట వినేవారే లేరని… అంతా BCCI దే హవా కొనసాగుతోందన్నాడు. బీసీసీఐ రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఐసీసీని ఆశ్రయించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నాడు. దీంతో మన సమయంతో పాటు, డబ్బు కూడా పోతుందన్నాడు.. టీమిండియాతో మొత్తం మ్యాచ్ లను బహిష్కరించి ఐసీసీపై తిరుగుబాటు  చేయండి అంటూ సూచించాడు. ఇప్పటికే చాలా నష్టపోయిన మనకు పోగొట్టుకోవడానికి ఏమీ మిగల్లేదన్నాడు. మన మాట వినాలన్నా..సరైన గౌరవం దక్కాలన్నా.. భారత్ తో ICC మ్యాచ్ లను బాయ్ కాట్ ఒక్కటే సరైన మార్గమని తెలిపాడు మియాందాద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy