టీమిండియా కోచ్ ఎవరో?

Cricket_India_Crest.svgప్రముఖంగా వినిపిస్తోన్న గంగూలీ పేరు

కొత్తగా వచ్చిన హైపర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవి

టీమిండియా కోచ్ గా డంకన్ ప్లేచర్ కాంట్రాక్ట్ పూర్తై చాలా రోజులే అయింది. రవిశాస్త్రిని బోర్డు డైరెక్టర్ గా నియమించి అతన్నే స్పెషల్ కోచ్ గా ట్రీట్ చేస్తోంది బీసీసీఐ. ఓ వైపు బంగ్లాదేశ్ టూర్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. స్వ్కాడ్ కూడా అనౌన్స్ చేసింది. కానీ కోచ్ విషయం మాత్రం తేలలేదు. బీసీసీఐ ప్రెసిడెంట్ గా జగ్మోహన్ దాల్మియా ఎంపికైన నాటి నుంచి బెంగాల్ దాదా గంగూలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీమిండియాకు కార్పొరేట్ కలర్ అద్దిన దాల్మియా… ఇండియన్ క్రికెట్ ను మరో మెట్టు ఎక్కించేందుకు దాదా సేవల్ని వాడుకోవాలనుకుంటున్నట్టు కథనాలొచ్చాయి. అందుకు తగ్గట్టే చీఫ్ కోచ్ గానో, టీం అడ్వైజర్ గానో.. లేకపోతే హై పర్ ఫామెన్స్ డైరెక్టర్ గానో ఏదో ఒక పదవి అతనికి ఇవ్వొచ్చన్న వాదనలు వినిపించాయి.

బంగ్లాదేశ్ టూర్ కు సౌరవ్ నే కోచ్ గా ఎంపిక చెయ్యొచ్చన్న వాదనలు వినిపించాయి. కానీ దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. కోల్ కతాలో సోమవారం జరిగిన కీలక సమావేశంలోనూ సౌరవ్ రోల్ ఏంటన్నది తేలలేదు. అయితే త్వరలోనే బంగ్లా టూర్ కు కోచ్ తో పాటు సపోర్ట్ స్టాఫ్ ని ప్రకటిస్తామన్నారు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్. మరోవైపు సచిన్, ద్రవిడ్ సేవలనీ ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అడ్వైజరీ కమిటీలో చోటివ్వొచ్చని భావిస్తున్నారు. ఇక టీ20 ఛాంపియన్స్ లీగ్ ను తీసేయాలన్న ఆలోచనకు బీసీసీఐ చెక్ పెట్టింది. దాని స్థానంలో అంతకన్నా కలర్ ఫుల్ గా మరో టోర్నీని సెప్టెంబర్ లో నిర్వహించాలనుకుంటోంది. ఛాంపియన్స్ లీగ్ ను ఇప్పటిదాకా ఇండియా, ఆస్ట్రేలియా,  సౌతాఫ్రికాలోనే నిర్వహించారు. దాన్ని క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ విస్తరించేలా చేయాలన్నది బీసీసీఐ వ్యూహం. ఇక మినీ ఐపీఎల్ ఆలోచనను మాత్రం బీసీసీఐ పక్కనపెట్టింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy