టీమిండియా కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు

bcci-logoటీమిండియా కోచ్‌ పదవి కోసం మరిన్ని దరఖాస్తుల కోరుతూ బోర్డ్  ఆఫ్ కంట్రో బోర్డు క్రికెట్ ఇన్ ఇండియా ( BCCI ) తాజాగా నిర్ణయం తీసుకుంది. అనిల్‌ కుంబ్లే రాజీనామాతో భారత జట్టు కోచ్‌ పదవికి ఖాళీ ఏర్పడింది. అంతకు ముందు కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, రిచుర్డ్‌ పైబస్‌, దొడ్డ గణేశ్‌ కోచ్‌ల రేసులో నిల్చారు.

తాజాగా BCCI మరోసారి దరఖాస్తులు ఆహ్వానించడంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. రెండోసారి దరఖాస్తులకు ఆహ్వానించడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రేసులో నిలిచిన వారి ప్రొఫైల్స్‌ పట్ల గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ), బీసీసీఐ అంతగా ఇంట్రెస్టు చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. బరిలో ఉన్న వారి అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని టీమిండియా ప్రధాన కోచ్‌ పదవిని అప్పగించలేమని వారు తెలిపారు. రేసులో నిలిచిన సెహ్వాగ్‌కి పెద్దగా కోచింగ్‌ అనుభవం లేదు… ఆయన కేవలం ఐపీఎల్‌లో ఒక జట్టుకి మాత్రమే కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ అనుభవాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుని సెహ్వాగ్‌కి కోచ్‌ పదవిని అప్పగించలేమన్న ఆలోచనలో BCCI ఉన్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు.. గతేడాది రవిశాస్త్రిని కాదని కుంబ్లేకి కోచ్‌ పదవి అప్పగించిన సీఏసీ ఈసారి అతనికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఉండటం వల్లే బీసీసీఐ మరోసారి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కూడా వార్తలు రావడంతో కోచ్‌ ఎంపిక ప్రక్రియ మరింత ఆసక్తిగా మారింది.

మరోవైపు గ‌తేడాది గంగూలీ చేతిలో అవ‌మానాన్ని ఇంకా మ‌ర‌చిపోని ర‌విశాస్త్రి.. నాకు కోచ్ ప‌ద‌వి కావాల‌ని అంద‌రిలాగా క్యూలో నిల‌బ‌డ‌నని.. క‌చ్చితంగా నాకే ఆ ప‌ద‌వి ఇస్తా అంటేనే దరఖాస్తు చేస్తా అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy