‘టీసీఎస్’ లో విలీనం కానున్న ‘సీఎంసీ’….!

ఐటీ సంస్థల్లో ఒకటైన ‘సీఎంసీ’ కంపెనీ త్వరలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో విలీనం కానుంది. నిర్వాహణ భారం, సరైన లీడర్ షిప్ లేకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘సీఎంసీ’ డైరెక్టర్లు చెప్పారు. ఈ రోజు రెండు కంపెనీల బోర్డు అఫ్ డైరెక్టర్లు విలీనంపై చర్చించారు. ‘సెక్షన్ 391,394 కంపెనీస్ యాక్ట్, 1956’ ప్రకారం విలీనం జరగనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ‘సీఎంసీ’ విలువ రూ.616 కోట్లుగా ఉంది. ఈ సంస్థను 1975లో స్థాపించారు. ప్రస్తుతం ‘సీఎంసీ’ కంపెనీలో పదకొండు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తోన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy