టీహబ్ తో మైక్రోసాప్ట్ దోస్తీ

0ea016a2-dfe3-4c15-a532-fc3f9fea3d09మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల…టీహబ్ ను సందర్శించారు. హైదరాబాద్ కు చేరుకున్న సత్యనాదెళ్ల…AP సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు బాబుతో చర్చించారు. ఆ తర్వాత టీహబ్ కు వచ్చిన సత్య నాదేళ్ల… టీ హబ్‌తో మైక్రోసాఫ్ట్‌ కలిసి పనిచేస్తుందన్నారు.  మంత్రి కేటీఆర్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి టీ హబ్‌ విశేషాలను వివరించారు. తర్వాత  టీ హబ్‌లోని స్టార్టప్‌ ప్రతినిధులతో ఆయన  మాట్లాడారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… ఐటీలో భారతీయుల నైపుణ్యాలు  రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.. ఇండియన్లు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారన్నారు. భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని సత్యనాదెళ్ల ప్రకటించారు. నాలుగు రోజుల టూరులో భాగంగా ఇండియాకు వచ్చిన సత్యనాదేళ్ల…. మైక్రోసాప్ట్ సీఈవో అయిన తర్వాత సిటీకి రావడం ఇది రెండోసారి.

0e4c325b-6570-4432-bdc9-faeae847685a

253f045b-57bf-460d-beb4-607ddc223a89

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy