టీ తాగుతూ.. నడుస్తూ.. షికారు చేస్తూ : జిన్ పింగ్ తో మోడీ ఛాయ్ పే చర్చ

Modi-chaiచైనాలో పర్యటనలో ఉన్న పీఎం మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఛాయ్ పే చర్చ చేశాడు. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం వీరిద్దరూ రెండు గంటలు వివిధ అంశాలపై చర్చించారు. టూరిజం ప్లేస్ అయిన వూహన్ లో మోడీతో భేటీ అయ్యారు జిన్ పింగ్. స్ట్ లేక్ దగ్గర దగ్గర నది అందాలను తిలకిస్తూ నడుస్తూనే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వివిధ రకాల ప్లేవర్స్ లోని టీ తాగారు. చిన్న కప్పుల్లో మూడు రకాల టీ తాగారు. ఇండియాలో ఛాయ్ వాలా ఎలా ఉంటాడు.. ఎలా టీ అందిస్తాడు అనేది జిన్ పింగ్ కు స్వయంగా చూపించారు ప్రధాని మోడీ.

టీ తాగిన తర్వాత ఈస్ట్ లేక్ లో డబుల్ డెక్కర్ పడవ గంట సేపు విహరించారు. ఈ సమయంలో భారత్ – చైనా మధ్య పలు అంశాలపై చర్చించారు. వాణిజ్య విషయాలపై అవగాహనకి వచ్చారు. విదేశీ పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన డోక్లాం సరిహద్దుల్లోని ఉద్రిక్తతను తగ్గించటం, రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనకు రావాలని మోడీ కోరినట్లు తెలుస్తోంది. గంటపాటు పడవలోనే వీరి చర్చలు జరిగాయి. నడుస్తూ.. టీ తాగుతూ.. బోటులో విహరిస్తూ రెండు గంటలపాటు మోడీ – జిన్ పింగ్ మధ్య జరిగిన ఛాయ్ పే చర్చ మంచి ఫలితాలను ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy