టీ హబ్ అద్భుతంగా ఉంది : నేపాల్ ప్ర‌ధాని

nepal2508హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ సతీసమేతంగా టీ హబ్ ను సందర్శించారు. నేపాల్ అధికార బృందంతో కలిసి ఆయన టీ-హబ్ లో కలియదిరిగారు. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని కితాబిచ్చారు. ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ టి హబ్ గురించి వివరించారు. ఆ త‌ర్వాత నేపాల్ ప్ర‌ధాని తో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ భేటీ అయ్యారు. నేపాల్ ప్ర‌ధాని గౌర‌వార్థం ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో గ‌వ‌ర్న‌ర్ విందు ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ క‌విత‌.. నేపాల్ ప్ర‌ధానికి బతుక‌మ్మను బ‌హుక‌రించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy