టీ 20 మ్యాచ్ : పోలీస్ నీడలో ఉప్పల్ స్టేడియం

stadiumహైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం ఇండియా – ఆస్ట్రేలియా మధ్య మూడో T-20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీనికి కోసం పోలీసులు భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ వింగ్,  ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ పార్టీ, విజిలెన్స్, ఆక్టోపస్ తో కలిపి మొత్తం 1800 మంది పోలీసులతో సెక్యురిటీ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఆటకు ముందు అంటే స్టేడియంలోకి సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. భద్రతలో భాగంగా స్టేడియం మొత్తం  56 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.   ల్యాప్ టాప్, కెమెరా, మాచ్ బాక్స్, బాటరీస్, బ్యానర్, సిగరెట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్ లు, వాటర్ బాటిల్స్ ను, పెన్స్ ను స్టేడియం లోనికి అనుమతించబోమన్నారు. సెల్ ఫొన్స్ కు పర్మిషన్ ఇస్తామన్న పోలీసులు.. పవర్ బ్యాంక్స్ అమతించమని తెలిపారు. క్రికెట్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీతో మాట్లాడి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.అమ్మాయిలను వేధించే పోకిరీలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటాయన్నారు భగవత్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy