టీ20: ఇండియా VS వెస్టిండీస్

INDIAకరీబియన్ గడ్డపై వన్డే సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్.. పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. లోభారత్‌ – కివీస్‌ మధ్య ఏకైక టీ 20 మ్యాచ్‌ ఆదివారం (జులై9) రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. సబీనాపార్క్‌లో జరగనున్న మ్యాచ్ లో రెండు దేశాలు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఓపెనర్‌గా దిగే అవకాశముంది. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున కోహ్లీ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అతడికి తోడు వన్డేల్లో మంచి ఫామ్‌తో ఉన్న రహానె కూడా ఓపెనర్‌గా దిగే అవకాశాలున్నాయి.
వన్డే సిరీస్‌ను 3-1 తో గెలిచిన ఇండియా… ఈ టీ 20 మ్యాచ్‌ను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు టీ 20 ప్రపంచ చాంపియన్‌లైన విండీస్‌ జట్టులో ఎలాగూ క్రిస్‌ గేల్‌కు అవకాశం రావడంతో.. అతడు ఓపెనర్‌గా దిగుతాడు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన గేల్‌ 15 నెలల తర్వాత విండీస్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అలాగే జట్టులో ఇంకా కెప్టెన్‌ బ్రాత్‌వేట్‌, శామ్యూల్స్‌, నరైన్‌, పొలార్డ్‌ ఉన్నారు. విండీస్‌ ఇన్నింగ్స్‌ ఓపెనింగ్‌ను గేల్‌తోపాటు లూయిస్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి.

విండీస్‌ ఈ ఏకైక టీ 20 కోసం వన్డే జట్టులో ఆడిన వారిలో కేవలం నాలుగు మార్పులే చేసింది. మరోవైపు ఇండియా ఒకటి రెండు మార్పులతో దిగనుంది. ఇప్పటివరకు వన్డేల్లో ఆడే అవకాశం రాని పంత్‌కు ఈసారి ఆడే అవకాశం రానుంది. ఈ సంవత్సరం ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో పంత్‌ తుది 11 మందిజట్టులో ఉన్నాడు. అలాగే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడిన కుల్దీప్‌ యాదవ్‌కు కూడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. వన్డేల్లో ఆడలేకపోయిన భువనేశ్వర్‌ టీ 20 లో మాత్రం పేసర్‌గా బరిలో దిగనున్నాడు. ఇక విండీస్‌ జట్టులో బౌలింగ్‌ పూర్తిగా స్పిన్నర్లు నరైన్‌, బద్రీలపైనే ఆధారపడి ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy