టూరిస్టు ప్లేస్ గా… మోడీ టీ స్టాల్

Modi-tea-stallప్రధాని మోడీ.. ఒక‌ప్పుడు గుజ‌రాత్ సీఎం. ఎన్నో సార్లు  ఆయ‌న సీఎంగా ఎన్నిక‌య్యారు. ఆ తర్వాత  దేశ ప్ర‌ధాని అయ్యారు. అయితే మోడీ చిన్నతనంలో చాయ్ అమ్మాడ‌ని అంద‌రికీ తెలుసు. ఆయ‌న చాయ్ అమ్మిన ఆ ప్రాంతం  గుజ‌రాత్‌లోని మెహ్ సన జిల్లా వడ్ నగర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆ ప్రాంతానికి మ‌హ‌ర్ద‌శ పట్టనుంది. కొన్ని వంద కోట్ల‌తో దాన్ని అభివృద్ధి చేయ‌నున్నారు.అంతే కాదు ఆ స్టేషన్ ను టూరిస్టు ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నారు.గుజ‌రాత్ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌డ్‌న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్‌ను సుంద‌రంగా తీర్చిదిద్ద‌నున్నారు. వ‌డ్‌న‌గ‌ర్ నుంచి మొదెరా, ప‌టాన్ ప్రాంతాల‌కు ఓ టూరిస్టు ట్రైన్‌ను కూడా న‌డ‌ప‌నున్నారు. ఈ టూర్‌లో వెళ్లిన వారు మోడీ చాయ్ అమ్మిన వ‌డ్‌న‌గ‌ర్  స్టేష‌న్‌ను మాత్ర‌మే కాదు… ఆయ‌న పుట్టి, పెరిగిన ఊరిని, చ‌దువుకున్న స్కూల్‌ను కూడా చూడ‌వ‌చ్చు. వాటిని కూడా టూర్‌లో భాగం చేయ‌నున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ టూర్‌ను ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తేనున్నారు. అతి త్వ‌ర‌లోనే మ‌నం మోడీ చాయ్ అమ్మిన ఆ స్టాల్‌ టూరిస్టు ప్లేస్ గా చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy