టూరిస్ట్ ప్లేస్ గా కన్ఫ్యూజన్ : ఇది చెత్త డంపింగ్ యార్డ్

japan garbage 2చెత్త కుండీ చూసినా.. చెత్త డంపింగ్ యార్డ్ చూసినా ముక్కు మూసుకుంటాం.. బాబోయే కంపు భరించలేకున్నాం అనుకుంటాం. ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి ఎవరం ఇష్టపడం. అలాంటిది ఓ చెత్త డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రతి ఏటా 20వేల మంది విదేశీ టూరిస్ట్ లు అక్కడి వచ్చి చూసి వెళుతున్నారు. ఏంటీ చెత్త డంపింగ్ యార్డ్ కి.. విదేశీ టూరిస్ట్ లా అని ఆశ్చర్య పోయే విధంగా ఉన్న ఈ కథ పూర్తి వివరాల్లోకి వెళితే..

జపాన్ దేశంలోని ఓసాకా నగరం ఉంది. చాలా బాగుంటుంది. జనం ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా.. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్.. హాలీవుడ్ స్టూడియో రేంజ్ లో ఉంటుంది. మన దేశంతోపోల్చితే మన రిసార్ట్స్, స్టూడియోలు ఉన్నట్లు సుందరంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే అదో థీమ్ పార్క్ లా ఉంటుంది. డిజైన్ కూడా అద్బుతంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల నుంచి చూసినా కనిపిస్తుంది. వివిధ డిజైన్లతో.. రంగులతో అద్బుతంగా తీర్చిదిద్దారు. లోపల మాత్రం ఓసాకా నగరం నుంచి వచ్చే చెత్తను రీసైక్లింగ్ చేస్తుంటారు. ప్లాస్టిక్, పేపర్, ఇతర వేస్టేజ్ ను వేర్వేరు వాటిని ఉపయోగిస్తుంటారు. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెత్త డంపింగ్ యార్డ్ ను ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్.. దీన్ని నిర్మించాడు. ఆ చుట్టుపక్కల వెళుతున్నా కనీసం కంపు కూడా కొట్టదు. లోపలికి వెళ్లి చూడాలి అన్న ఆశ కలుగుతుంది. ఓ చెత్త డంపింగ్ యార్డ్ ఇంత సుందరంగా తీర్చిదిద్దటం ప్రపంచంలో ఇదే. బయటకు నుంచి చూస్తే 500 కిటికీలు ఉన్నట్లు కనిపిస్తూ.. వాస్తవం కేవలం 130 కిటికీలు మాత్రమే ఉన్నాయి.

ప్రపంచం మొత్తం వైరల్ అవుతుంది ఇది.. మన దేశంలో ఇలాంటిది ఉంటే ఎంత బాగుంటుందో కదా..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy