టూరిస్ట్ ల కోసం స్పెషల్ మొబైల్ ఆప్..!

shripad-1ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆప్లికేషన్ లతో క్షణాల్లో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తాజాగా కేంద్ర టూరిజం డిపార్ట్ మెంట్ మొబైల్ ఆప్ ను రిలీజ్ చేసింది. ఈ ఆప్ తో దేశంలోని 16 నగరాల్లో ఏమీ తెలియకపోయినా సింగిల్ గా తిరిగేలా క్రియేట్ చేశారు. దాదాపు సెల్ఫ్ గైడ్ గా ఈ అప్లికేషన్ ఉపయోగపడనుంది. జెనిసిన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ క్రియేట్ చేసిన ఈ అప్లికేషన్ ను టూరిజం డిపార్ట్ మెంట్ స్టార్ట్ చేసింది.

ఈ అప్లికేషన్ సాయంతో దేశంలోని పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ఆగ్రా, అమృత్ సర్, అహ్మదాబాద్, బెంగళూర్, భోపాల్, ఛండీగడ్, చెన్నై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, ముంబై, పాట్నా, పూణే, సూరత్ నగరాలను ఎంపిక చేశారు. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టుగానే ఈ నగరాలను ఎంపిక చేసినా భవిష్యత్తులో వాటి సంఖ్య 36కు చేరుకొనే అవకాశం ఉంది. ఈ మొబైల్ అప్లికేషన్ తో చాలా ఈజీగా ఆయా నగరాల్లో ట్రావెల్ చేయోచ్చని టూరిజం మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ బ్లాక్ బెర్రీ ఫోన్లలో మాత్రమే ఉందని..త్వరలోనే మిగతా ఫోన్లలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy