టూవీలర్‌ కొనే మహిళలకు 50 శాతం రాయితీ

24metsc17_201320మహిళల టూ వీలర్ కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించనున్నారు. జనాకర్షక పథకాలకు నెలవైన తమిళనాడులో త్వరలో ఈ పథకం ప్రారంభం కానుంది.  అమ్మ టూవీలర్‌ పథకాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ఈ పథకాన్ని జయలలిత 70వ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 24న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం సోమవారం (జనవరి-22)న తెలిపింది.

రూ.2.50 లక్షల లోపు ఆదాయ పరిమితి కలిగి 18-40 ఏళ్ల వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. 125 సీసీలోపు ఉన్న స్కూటర్లు, మోపెడ్ల కొనుగోలుకు ఈ పథకం వర్తిస్తుంది. వాహన ధరలో 50 శాతం లేదా రూ.25వేల రాయితీని ప్రభుత్వం ఈ పథకం కింద అందించనుంది. కుటుంబాన్ని సాకే మహిళ, వితంతు, దివ్యాంగ మహిళలకు, హిజ్రాలకు ప్రాధాన్యం ఈ పథకంలో ఇవ్వనున్నారు. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం వెల్లడించింది.

 

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy