టెక్నాలజీ డేటాలతో ప్రపంచం మరింత ముందుకు : మోడీ

MODID20 ఏళ్ల తర్వాత దావోస్ వేదికపై భారత ప్రధానిగా ప్రసంగం చేయడం సంతోషాన్నించిందన్నారు మోడీ. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సుకు హాజరైన మోడీ .. మంగళవారం (జనవరి-23) స్వాగత ఉపన్యాసం చేశారు. దావోస్ సదస్సులో చివరగా 1997లో నాటి భారత్ ప్రధాని దేవెగౌడ ప్రసంగించినట్లు మోడీ గుర్తు చేశారు. 1997లో భారత్ GDP 400 బిలియన్ డాలర్లుగా ఉన్నదని తెలిపారు. నాటికి నేటికీ భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్న మోడీ.. 20 ఏళ్లలో భారత్ GDP 6 రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిగా వ్యవహరిస్తోందన్నారు.

ప్రపంచం సాంకేతికంగా ఎదుగుతోందని.. సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తున్నామన్నారు. ఇంటర్నెట్ లో కొత్త కొత్త పరీక్షలను ఎదుర్కోంటున్నామన్న ఆయన.. టెక్నాలజీలో ఎలాంటి ఇబ్బందులున్నాయో సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. డేటాను గుప్పింట్లో పెట్టుకున్నావారే భవిష్యత్తును శాసిస్తారని..బిగ్ డేటాలతో ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. టెక్నాలజీతో నాలెడ్జ్, మంచితో పాటు చెడుకు కూడా ఆస్కారం కలుగుతుందన్న మోడీ..ప్రపంచం ఎదుర్కోంటున్న సమస్యలను వెతకాల్సి ఉందన్నారు. వసుదైక  కుటుంబ భావనను అనాధిగా ఇండియా కొనసాగిస్తుందన్న ప్రధాని.. దేశాల మధ్యన సంబంధాలు లేకపోవడమే సమస్యలకు కారణమన్నారు.  ప్రపంచదేశాలు అభివద్ధి దిశగా సాగేలా..అంతర్జాతీయ సదస్సులను భారత్ కు ఆహ్వానిస్తున్నామన్నారు. దావోస్ సదస్సు భారత్ కు ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.

ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలి
ప్రపంచానికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్న మోడీ.. యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం పెనుసవాళ్లు విసురుతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద సమస్యను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అసవరం ఉందన్నారు. విద్యావంతులైన యువకులు కూడా తీవ్రమైన భావజాలంతో ఉగ్రవాదానికి ప్రభావితమవుతున్నారని మోడీ ఆవేదన చెందారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy