టెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

TSTETరాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్( TS టెట్‌)ను ఆదివారం (జులై23)న నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.00 వరకు పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్‌కు 3,67,912 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,574 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టెట్ కన్వీనర్ బీ శేషుకుమారి తెలిపారు.

పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్ కు చేరుకోవాలని తెలిపారు. ఓఎమ్మార్ షీట్‌లో సర్కిళ్లను నింపడానికి కేవలం బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే ఉపయోగించాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా సెంటర్ లోకి తీసుకువెళ్లకూడదని..OMR షీట్‌ను చించడం, మడతపెట్టడం లాంటివి చేయకూడదని తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy