టెట్ దరఖాస్తు మరోసారి గడువు పెంపు

tetఎలిజబిలిటీ టెస్ట్‌ దరఖాస్తు గడువును మరోసారి పొడగించింది పాఠశాల విద్యాశాఖ. బీఈ, బీటెక్‌తో బీఈడీ చేసిన అభ్య ర్థులకు టెట్‌ పేపర్‌-2కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరికోసం మరోసారి టెట్‌ దరఖాస్తు గడువును పెంచుతున్నట్టు టెట్‌ కన్వీనర్‌ శేషుకుమారి తెలిపారు.

29వరకు ఫీజు చెల్లించ వచ్చనీ… 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయ వచ్చని తెలిపారు. 2015-17 బ్యాచుకు చెందిన బీఈడీ రెండోసంవత్సరం చదువు తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాగా బీఈ, బీటెక్‌తో బీఈడీ చేసిన వారికి టెట్‌ రాసే అవకాశం కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్‌ నేతలు ఇటీవల వినతిపత్రం ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy