టెన్త్ ఎగ్జామ్ బిగ్ రిలీఫ్ : ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేత

10th-Class-Exams-201810వ తరగతి స్టూడెంట్స్ కి బిగ్ రిలీఫ్. ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేసింది విద్యాశాఖ. నిబంధన అయితే ఉంటుంది కానీ.. అది ఒక్క నిమిషం కాదని ప్రకటించింది. ఇక నుంచి ఐదు నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి ఇస్తామని వెల్లడించారు. ఐదు నిమిషాల తర్వాత మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ డైరెక్టర్ జి.కిషన్. ఒక్క నిమిషం అనేది విద్యార్థులను ఆందోళనకి గురి చేస్తోందని.. ఈ క్రమంలో ఈ నిబంధనను సడలించటం జరిగిందన్నారు. 15వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి ఎగ్జామ్ కి హాజరయ్యే స్టూడెంట్స్ ను.. 5 నిమిషాల ఆలస్యం వరకు అనుమతించటం జరుగుతుందన్నారు.

ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని.. విద్యార్థులు అందరూ కచ్చితంగా 45 నిమిషాలు ముందు అంటే 8:45 గంటలకే ఎగ్జామ్ సెంటర్ కు హాజరుకావాలని సూచించారు. ఈ ఏడాది 5లక్షల 38వేల 867 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. వీరిలో 2లక్షల 76వేల 388 మంది బాయ్స్,  2లక్షల 62వేల 479 గాల్స్ ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy