టెన్నీస్ లోనూ ఫిక్సింగ్

tennisఫిక్సింగ్ జాడ్యం టెన్నీస్ కు పాకింది. ఇప్పటి వరకు క్రికెట్ లోనే వినిపించిన ఈ పదం ఇప్పుడు టెన్నీస్ కు పాకడంపై కలవరపడుతున్నారు టెన్నీస్ క్రీడాభిమానాలు. మొత్తం 16 మంది క్రీడాకారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా టాప్ 50లో ఉంటున్న ఈ క్రీడాకారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడతున్నాయి. ఫిక్సింగ్ కు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని తెలుపుతున్నారు అధికారులు.  ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొంటున్న 8 మంది టాప్ సీడ్ క్రీడాకారుల పాత్ర ఉన్నట్లు చెబుతున్నాయి బీబీసీ – బజ్ ఫీడ్ వర్గాలు. 2007 – 2009 మధ్య జరిగిన మ్యాచ్ లలో అవినీతి జరిగినట్టు తెలుపుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన టెన్నీస్ సమాఖ్య టెన్నీస్ లో అవినీతి రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy