టెన్షన్.. టెన్షన్.. పోలీస్ వలయంలో సిరిసిల్ల

sircillaనేరెళ్ల సభపై ఉత్కంఠ నెలకొంది. దళితులకు సంఘీభావంగా జరుపుతున్న ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయవంతం చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు బహిరంగ సభకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోరుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం చేసుకున్న దరఖాస్తును సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ తిరస్కరించారు. దీంతో కోర్టుకు వెళ్లారు కాంగ్రెస్ నాయకులు.  మీరాకుమార్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 12 గంటల వరకు నేరెళ్ల గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని మృత్యుజయం తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. నేరెళ్ల ఘటనకు నిరసనగా బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధం కావడంతో.. దీనికి కౌంటర్‌గా పోలీసులు జిల్లాలో 30 యాక్ట్‌ను అమల్లోకి తెచ్చారు. సభకు అనుమతి లేదంటూ దానిని అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి నేతృత్వంలో ఆరుగురు డీస్పీలు, 25 మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, డిస్ర్టిక్ట్‌ గార్డులతో కలిపి దాదాపు వెయ్యి మంది వరకు సిరిసిల్లకు చేరుకున్నారు.

 

జిల్లాకు సరిహద్దులుగా ఉన్న సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల సరిహద్దుల నుంచి అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. సిరిసిల్ల ఇన్‌చార్జ్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సిరిసిల్లలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా సభలు నిర్వహిస్తే చట్టరీత్యా నేరమవుతుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు నిర్వహించే సమయంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సభలకు ఎవరైనా మైకులు, టెంటు, వాహనాలు ఇచ్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy