టెన్షన్ ఫ్రీ బాబూ : ఆన్ లైన్ లో టికెట్ – ఇంటి దగ్గర పేమెంట్

railతత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు భారీ ఊరట ఇచ్చింది రైల్వే శాఖ.  అత్యవసరంగా ప్రయాణించాలనుకునే వారు ఆన్‌లైన్‌లో టికెట్‌ను బుక్‌ చేసుకుని, పేమెంట్‌ తరువాత చెల్లించవచ్చు. ఇంటి దగ్గర చెల్లించే (పే ఆన్‌ డెలీవరీ) సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ. వెబ్ సైట్లో తత్కాల్ కోటా కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు డబ్బును తరువాత చెల్లించవచ్చని ప్రకటించింది. ఇంతవరకు ఈ సౌకర్యం సాధారణ రిజర్వేషన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు.

ఇందుకోసం వినియోగదారులు www.irctc.payondelivery.co.in తో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌ లేదా పాన్ వివరాలు జతచేయాలి. టికెట్‌ బుకింగ్ చేస్తున్నప్పుడు  పే-ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డిజిటల్ డెలివరీ sms/ఈ-మెయిల్ ద్వారా తక్షణమే జరుగుతుంది. 24 గంటలలోపు పేమెంట్‌ స్వీకరణ జరుగుతుంది. ఒకవేళ టికెట్ల డెలివరీలోపు క్యాన్సిల్‌ చేసుకుంటే భారీ జరిమానా ఉంటుంది. irctc ఖాతాను బ్లాక్ చేస్తారు.

టికెట్లు ఇంటి దగ్గర డెలివరీ చేయాలనుకుంటే వినియోగదారులు నగదు, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్‌ బుకింగ్‌ సమయంలో కొన్నిసార్లు డబ్బు డెబిట్ అయినా, టికెట్‌ బుక్‌ కాకపోవడం, అలాగే డబ్బులు తిరిగి మన ఖాతాలోకి  చేరడానికి  7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త ఈ- లావాదేవీలు వైఫల్యాలను తొలగిస్తుందని చెబుతోంది రైల్వేశాఖ. రోజువారీగా చూస్తే irctc లక్షా 30వేల తత్కాల్‌ టికెట్లు విడుదల చేస్తోంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy