టెయిల్ పాండ్ మాది….కాదు….మాది!

tailనల్గొండ జిల్లా దామరచర్ల మండలం. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించిన టెయిల్ పాండ్. సాగర్ కు 21 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఇపుడీ ప్రాజెక్ట్ నిర్వహణ వివాదంగా మారింది. విభజన టైంలో డ్యాం నిర్వహణ తెలంగాణకు, పవర్ ప్రాజెక్ట్ బాధ్యతలు ఏపీకి ఉండేలా ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకుని ఎడమవైపు గేటు ఏర్పాటు చేసింది. దీనిపై బాబు సర్కారుకు తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ లేఖ రాశారు. ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు మేమే చూస్తాం… పవర్ మీకు కేటాయిస్తామని లేఖలో రాశారాయన. దీనికితోడు 400 కోట్ల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ ఖాతాలో వేసింది కేంద్రం. దాంతో ప్రాజెక్ట్ పై అజమాయిషీ కోసం తెలంగాణ పట్టుబడుతోంది. కానీ ఏపీ ప్రభుత్వం మొండికేసింది. పైగా పోలీసులను మొహరించి రాకపోకలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్ లో అంతర్భాగం టెయిల్ పాండ్. దామరచర్ల మండలంలోని అడవి దేవులపల్లి-గుంటూరు జిల్లా సత్యశాల మధ్య ఉంటుందీ డ్యాం. 1975లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 7 టీఎంసీలు. 30 మీటర్ల ఎత్తు, 642 మీటర్ల పొడవుండే డ్యాంకు 21 క్రస్టు గేట్లున్నాయి. కుడివైపు 50 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుంది. 8 రివర్స్ టర్బైన్లతో మిగులు జలాల్ని సాగర్ డ్యాంకు తరలించే వెసులుబాటుంది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు జోక్యంతో టెయిల్ పాండ్ వివాదం కొలిక్కి వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy