టెలికం రంగంలోకి రాందేవ్ : పతంజలి సిమ్ కార్డులు వచ్చాయి

patanjali-simయోగా గురువు బాబా రామ్ దేవ్ మరో బిజినెస్ పెట్టారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల వ్యాపారంలో బాగా విజయం సాధించిన రాందేవ్.. ఇప్పుడు టెలికాం రంగంలో అడుగు పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థ  BSNL ఒప్పందం చేసుకుని స్వదేశీ-సమ్‌ రాధి సిమ్‌ కార్డులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. పతంజలి సిమ్‌కార్డుతో రూ.144 రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 2GB డేటా ప్యాక్‌ తో పాటు.. 100 SMS ప్రీ.

ప్రస్తుతానికి పతంజలి ఉద్యోగులు, అధికారులు మాత్రమే సిమ్‌ కార్డు ప్రయోజనాలు పొందనున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే.. ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడ మరో బంపరాఫర్ కూడా ఇచ్చారు. పతంజలి సిమ్ కార్డు వినియోగదారులకు.. పతంజలి ఉత్పత్తులపై 10శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించారు. అంతే కాదండీ.. రూ.2.5 నుంచి రూ.5లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా అందిస్తున్నారు. యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రజలకు అందిస్తామని తెలిపింది పతంజలి సంస్థ. దేశవ్యాప్తంగా BSNL కు 5లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సమ్‌ రాధి కార్డును పొందవచ్చని తెలిపారు యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy