టెస్ట్ ఛాంపియన్ షిప్ కు శ్రీకారం

iccక్రికెట్ కు మరింత ప్రచారం తీసుకొచ్చే దిశగా ICC  కీలక నిర్ణయం తీసుంది.  సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు పెంచే దిశగా టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే ఇంటర్నేషనల్ లీగ్ ల నిర్వహణకు శుక్రవారం( అక్టోబర్-13) గ్రీన్ సిగ్నలిచ్చింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ICC గవర్నింగ్ బాడీ సమావేశం తర్వాత సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ ఈ విషయాలను తెలిపారు. టెస్ట్ సిరీస్ లీగ్‌లో భాగంగా 9 టీమ్స్.. రెండేళ్ల వ్యవధిలో మొత్తం ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుందన్నారు. అందులో మూడు సొంతగడ్డపై, మూడు బయట జరుగుతాయన్నారు. వన్డే లీగ్‌ను ఐసీసీ వరల్డ్‌కప్‌కు క్వాలిఫికేషన్ టోర్నీగా ఐసీసీ డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం 12 సభ్యదేశాలతోపాటు ప్రస్తుత ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్ విజేత తలపడతాయి. 2019, 2020 నుంచి ఈ టెస్ట్, వన్డే లీగ్స్ ప్రారంభమవుతాయి.

టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్‌లు ఆడుతుంది. మూడు ఇంట, మూడు బయట. ఈ సిరీస్‌లు కనీసం రెండు నుంచి గరిష్టంగా ఐదు టెస్ట్‌ల వరకు ఉంటాయి. చివరగా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుంది. ఇక వన్డే లీగ్‌లో 13 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. తొలి ఎడిషన్‌లో భాగంగా ప్రతి జట్టు నాలుగు సొంతగడ్డపై, నాలుగు విదేశీ సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి సిరీస్‌లో మూడు వన్డేలు ఉంటాయి.

నాలుగు రోజుల టెస్ట్ క్రికెట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సభ్య దేశాలకు ICC  అనుమతినిచ్చింది. ఆయా క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో ఈ నాలుగు రోజుల టెస్ట్‌లను నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన ప్లేయింగ్ కండిషన్స్‌ను ఖరారు చేసే పనిలో ఐసీసీ ఉంది. డేనైట్ టెస్ట్‌లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే వీటిని కూడా ఆయా బోర్డులు నిర్వహించుకోవచ్చని ఐసీసీ స్పష్టంచేసింది. ఇక 2019 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ వచ్చే ఏడాది మార్చిలో జింబాబ్వేలో నిర్వహించాలని ICC నిర్ణయించింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy