టేస్ట్ నచ్చిందట : లక్షా 30 వేలు టిప్పు ఇచ్చాడు

HOTEL TIPహోటల్‌కు వెళ్తే.. అక్కడ మీకు వంట నచ్చితే.. మీరెంత టిప్ ఇస్తారు. మా అంటే వెయిటర్‌ ను సంతృప్తి పరుస్తారు. అయితే అమెరికాలో ఓ భోజన ప్రియుడు ఆ హోటల్ సిబ్బందికే తన టిప్‌ తో షాక్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్‌ లో పనిచేస్తున్న అందర్నీ స్టన్ చేశాడు. సియాటిల్‌ కు చెందిన మైక్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో చికాగోలో ఉన్న బోకా రెస్టారెంట్‌ కు వెళ్లాడు. అక్కడ తిన్న ఫుడ్ కి 759 డాలర్ల ( రూ.50వేలు) బిల్లు అయ్యింది.

అయితే ఆ రెస్టారెంట్ కుక్స్ వండిన డిష్‌ లు మైక్‌ కు తెగ నచ్చాయి. ఆ సంతోషాన్ని తన టిప్‌ తో చాటిచెప్పాడు. హోటల్ సిబ్బందికి రెండువేల డాల‌ర్లు(రూ.లక్షా 30వేలు) టిప్‌ గా ఇచ్చాడు. బిల్ తెచ్చిన వెయిటర్‌ కు మొదటగా 300 డాలర్లు టిప్ ఇచ్చాడు. ఆ తర్వాత కిచెన్‌ లోకి వెళ్లి 17 మంది స్టాఫ్ సభ్యులకు ఒక్కొక్కరికి 100 డాలర్లు ఇచ్చాడు. సిబ్బందితో మైక్ దిగిన ఫోటోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది ఆ హోటల్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy