టైంకి షాప్ క్లోజ్ చేయకపోతే జైలే..

city policeరాత్రి పూట నిర్దేశిత వేళల్ని మించి వ్యాపారాలు కొనసాగించడం..పోలీసులు వస్తే జరిమానా కట్టడం..కేసు నమోదు అంటే ఉద్యోగిపై నమోదు చేయించడం..లాంటి వ్యవహారాలకు ఇక చెక్ పడనుంది. ఈ తరహా ఉల్లంఘనలపై కేసు నమోదు చేయడంతో పాటు న్యాయస్థానంలో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటోంది సిటీ పోలీసు విభాగం. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఈ-పెట్టీ కేస్’ యాప్ క్షేత్రస్థాయి సిబ్బంది ట్యాబ్స్ లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని వినియోగించి నమోదు చేసిన కేసుల్లో ఇప్పటికే పలువురు వ్యాపారులకు జైలు శిక్ష పడింది. గరిష్టంగా ఐదు రోజుల శిక్ష పడిన వాళ్ళు సైతం ఉన్నట్లు పేర్కొంటున్నారు పోలీసు అధికారులు.

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అసాంఘిక శక్తులు సంచరించే ఆస్కారం లేకుండా వ్యాపార సంస్థలకు పోలీసులు వేళల్ని నిర్దేశించారు. సిటీలోని వైన్ షాపులు రాత్రి 10 గంటలకు, మాల్స్ అండ్ రెస్టారెంట్లు 11 గంటలకు, మిగిలిన వ్యాపార సంస్థలు, హోటల్స్ 12 గంటలకు మూసివేయాలి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

సమయం మించి వ్యాపారం నిర్వహిస్తూ చిక్కిన వారి వివరాలను నమోదు చేసే ‘ఈ పెట్టీ కేస్’ యాప్ కు సంబందించి పోలీసు విభాగం ఓ డేటాబేస్ ను రూపొందిస్తోంది. కేసు నమోదు చేసినా.. ఓ వ్యాపార సంస్థ పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే ఈ విషయాన్ని యాప్ దానంతట అదే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. ఈ వివరాలు పోలీసులు రూపొందించే చార్జ్ షీట్ లోనూ పొందపరుస్తుంది. ఇలా దాఖలైన అభియోగపత్రాలను పరిగణలోకి తీసుకుంటున్న న్యాయస్థానాలు.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వ్యాపారులకు జైలు శిక్షలు విధిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy