టైం అంటే ఇలా ఉంటుంది : ప్రముఖ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే.. దీనస్థితిలో జైల్లో

producer-changalaఈయన కథ వింటే.. అవునా.. నిజమా.. అయ్యో అయ్యయ్యో అనాల్సిందే. అతని వాలకం చూస్తే సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన నిర్మాతేనా అనిపిస్తోంది.. అతని ఒంటరితనం చూస్తే మాజీ ఎమ్మెల్యేలేనా.. ఐదేళ్లుగా నియోజకవర్గానికి తిరుగులేని అధినేతగా ఎదిగిన నేతేనా అనిపిపిస్తోంది.. కనీసం అతన్ని గుర్తు పట్టటానికి కూడా వీళ్లేనంతంగా మారిపోయారు.. ఆయనే సమరసింహారెడ్డి సినిమా నిర్మాత, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చుట్టూ హీరోలు, హీరోయిన్స్ ఎంతో కలర్ ఫుల్ జీవితం. బాలకృష్ణను సీమ సింహంగా, సినీ ఇండస్ట్రీకి రాయలసీమ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నిర్మాత. అదే ఇమేజ్ తో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2004లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దూకుడు స్వభావం ఉండే చెంగల వెంకట్రావ్.. 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట బీచ్ లో మినరల్స్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేగా వ్యతిరేకించారు. ఆయన వర్గం కూడా ఇదే డిమాండ్ పై ఉంది. అయితే స్థానికులు మాత్రం కంపెనీలు పెట్టాల్సిందే అని పట్టుబట్టారు. రెండు వర్గాల ఘర్షణలో ఓ మత్స్యకారుడు చనిపోయాడు. కేసు నమోదు అయ్యింది.

ఈ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన చెంగల వెంకట్రావ్ ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే..2007లో జరిగిన ఘర్షణ కేసులో అనకాపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో 21 మందికి యావజ్జీవ శిక్ష విధించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన కుమారుడి అనారోగ్యం కారణంగా ఆరు నెలలు బెయిల్ పై బయటకు వచ్చి.. ఇటీవలే మళ్లీ జైల్లోకి వెళ్లారు. చెంగల వెంకట్రావ్ అనారోగ్యానికి గురవ్వటంతో ఆయన్ను విశాఖపట్నంలోని KGH ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా సాధారణ ఖైదీలను ఉంచే సెల్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. జూన్ 29వ తేదీ శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చారు. డెంగీ బాధితులను పరామర్శిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత చెంగల వెంకట్రావ్ కూడా ఉన్నారు. ఆయనను చూసి కలెక్టర్ కూడా గుర్తించలేకపోయారు. సాధారణ ఖైదీ అనుకున్నారు. వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ఒంటిపై బనీను, మాసిన గడ్డం, చెరిగిన జుట్టు చూసి ఔరా అనుకున్నారు. టైం అంటే ఇదేనేమో.. పాతాళానికి పడిపోవటం అంటే ఇదేనేమో కదా..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy