టైటిల్ ఫైట్ : విండీస్‌తో ఆఖరి వన్డే

india-westindiesక్లైమాక్స్‌కు చేరుకుంది భారత్‌-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌. టైటిల్ డిసైడ్ చేసే చివరి ఐదో వన్డేకు రెండు జట్లు రెడీ అయ్యాయి. నాలుగో వన్డేలో బ్యాటింగ్‌ వైఫల్యాన్ని సరిదిద్దుకుని ఫైనల్ ఫైట్ కు రెడీ అయ్యింది కోహ్లీ సేన. 3-1తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా.. సిరీస్‌ సమం చేయటానికి విండీస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ సిరీస్‌ ఫలితం కోసం ఆఖరి మ్యాచ్‌ వరకూ వేచి చూడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు.

నాలుగో వన్డేలో స్లో పిచ్‌పై 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికిలపడింది. రహానె మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ నిరాశ పర్చారు. సిరీస్‌ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్‌ అంతా సత్తా చాటాల్సిందే. గత మ్యాచ్‌లో అనూహ్య విజయంతో విండీస్‌ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది. సిరీస్‌ సమం చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆ జట్టు భావిస్తోంది.

భారత్‌: రహానె, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), కార్తీక్‌, ధోనీ, కేదార్‌/రిషభ్‌, హార్దిక్‌, జడే జా/అశ్విన్‌, కుల్దీప్‌, ఉమేష్‌, షమి.

వెస్టిండీస్‌: లూయిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (కీపర్‌), ఛేజ్‌, మహమ్మద్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), పావెల్‌, నర్స్‌, బిషూ, జోసెఫ్‌, విలియమ్స్‌.

పిచ్‌/వాతావరణం

సబినా పార్క్‌ వికెట్‌ ఇటీవలి కాలంలో చాలా స్లోగా మారిపోయింది. కానీ, గ్రౌండ్‌ చిన్నది కావడంతో బౌండ్రీలు సులభంగా వస్తున్నాయి. అయితే, ఇక్కడ వన్డే జరిగి మూడేళ్లవుతోంది. కింగ్‌స్టన్‌లో గురువారం జల్లులు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy