టైటిల్ విని మోడీ పడిపడి నవ్వేశారు

toiletబాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్… ప్రధాని మోడీని నవ్వుల్లో ముంచెత్తారు. మోడీ అంతగా నవ్వడానికి.. కారణమేంటని అనుకుంటున్నారా? అక్షయ్ చేయబోయే కొత్త సినిమా పేరే దీనికి కారణం. అక్షయ్‌ ‘టాయ్‌లెట్‌ – ఏక్‌ ప్రేమ్‌కథా’ సినిమాలో నటిస్తున్నారు. మోడీ ‘స్వచ్ఛ భారత్‌’ మిషన్ లో భాగంగా ఈ సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా అక్షయ్‌.. మోడీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్‌ తన సినిమా టైటిల్‌ గురించి చెప్పగానే మోడీ నవ్వు ఆపుకోలేకపోయారట. ఈ విషయాన్ని అక్షయ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు. ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమి పెడ్నేకర్‌ నటిస్తోంది. శ్రీనారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy