పేద టైపిస్టుపై యూపీ సర్కార్ కరుణ

copయూపీ రాజధాని లక్నోలో తన జులూం ప్రదర్శించాడు ఓ పోలీసు. లక్నో జనరల్ పోస్టు ఆఫీస్ ఎదుట టైప్‌రైటర్‌తో ఓ వృద్ధుడు పని చేస్తున్నాడు. గత 35 ఏళ్ల నుంచి ఆయనకు అదే జీవనాధారం. అయితే  ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని వృద్ధుడిని హెచ్చరించాడు. వృద్ధుడు తన పని తాను చేసుకుంటుండగా ఎస్‌ఐ వీరావేశంతో టైప్‌రైటర్‌ను కాలితో తన్నాడు.

 

lucknow-typewriter1దీంతో టైప్‌రైటర్ ముక్కలు ముక్కలైపోయింది. వృద్ధుడు రెండు చేతులెత్తి దండం పెట్టినా ఎస్‌ఐ కనికరించలేదు. ముక్కలైనా టైప్‌రైటర్‌ను వృద్ధుడు తీసుకుని సరి చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ను అక్కడే ఉన్న జర్నలిస్టులు తమ కెమెరాలలతో క్లిక్ మనిపించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికిది ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్‌యాదవ్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం… ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా వృద్ధుడికి కొత్త టైప్‌రైటర్లు కొని ఇచ్చారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy