టోక్యో సదస్సుకు కాకతీయ వర్శిటీ విద్యార్థి

gmaheshకాకతీయ యూనివర్శిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి గుగులోతు మహేశ్ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న 21వ అంతర్జాతీయ సాంస్కృతిక సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సదస్సులో రామప్ప ఆలయంపై పేపర్ ప్రజెంట్ చేయనున్నాడు. కాకతీయ వర్శిటీలో హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మహేశ్ పీహెచ్‌డీ చేస్తున్నాడు. వరంగల్‌లోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించాలని కోరుతూ అతను అధ్యయనం చేశాడు. జేఎఫ్ ఒబెర్లిన్ యూనివర్శిటీలో ఈ సదస్సు జరగనున్నది. కాకతీయుల కాలం నాటి కళా వైభావాన్ని తన అధ్యయన నివేదిక ద్వారా మహేశ్ వివరించనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భూపాల్‌లో జరిగిన ఓ సదస్సులోనూ అతను వరంగల్‌లోని ట్రైబల్ టూరిజం గురించి పేపర్ ప్రజెంట్ చేశాడు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy