టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు

TOLLటోల్ ప్లాజాల దగ్గర గంటల పాటు లైన్లో వెయిట్ చేసి… డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఇకపై వాహనదారులకు లేదు. టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు చర్యతీసుకుంది నేషనల్ హైవేస్ అథార్టీ ఆఫ్ ఇండియా(NHAI). వాహనదారులు మొబైల్‌ ఫోన్ల నుంచే డబ్బు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రీపెయిడ్‌ వాలెట్లు, క్రెడిట్‌ కార్డుల ద్వారా, బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ఖాతాల నుంచే డబ్బుచెల్లించే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. వాహనం టోల్‌ప్లాజా దగ్గరికి రాగానే ఆటోమేటిక్‌గా వారి ఖాతాల నుంచి డబ్బు కట్‌ అయ్యే విధానం తీసుకువస్తున్నారు.

మొదటగా ఈ విధానాన్ని అయిదు ప్రాంతాల్లో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చండీగఢ్‌,ఢిల్లీ-కోల్‌కతా, బెంగళూరు-చెన్నై స్ట్రెచ్‌లలో పరీక్షిస్తున్నట్లు సమాచారం. టోల్‌ ప్లాజాల వద్ద  డబ్బు చెల్లించేందుకు ఆగకుండా నేరుగా ఖాతాలో నుంచి కట్టగలిగేలా అన్ని ఆప్షన్లతో కూడిన మొబైల్‌ అప్లికేషన్‌ను NHAI మరికొన్ని నెలల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వారి వాహానానికి సంబంధించిన వివరాలు అందులో పొందురచాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా దగ్గరకు రాగానే వైఫై, బ్లూటూత్‌ సహాయంతో ఫోన్‌లోని యాప్‌ దాన్ని డిటెక్ట్‌ చేస్తుంది. ప్లాజాలోని సిస్టమ్‌ వాహనాన్ని గుర్తించి టోల్‌ డబ్బును యాప్‌తో లింక్ చేసిన ఖాతా నుంచి కట్‌ చేసుకుంటుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy