ట్యాక్సీలోనే మహిళ ప్రసవం

Taxiఆమె వయస్సు 20 ఏళ్లు.. సౌత్ ఢిల్లీలోని డియోలీ ఏరియాలో ఉంటుంది. నిండు గర్భిణి. నొప్పులు రావటంతో.. ట్యాక్సీలో ఆస్పత్రికి బయలుదేరారు. ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపే ఆ మహిళకు నొప్పులు ఎక్కవ అయ్యాయి. దీంతో క్యాబ్ డ్రైవర్ కారును రోడ్డు పక్కనే ఆపేశాడు. అంబులెన్స్ కు కాల్ చేసేలోపే.. ఆ మహిళ ట్యాక్సీ బ్యాక్ సీట్ లో పండంటి బిడ్డను జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు సప్ధార్ గంజ్ ఆస్పత్రి వైద్యులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy