పిల్లల్ని గాజుపెంకుల్లో నడిపించిన టీచర్

vadodra-student--v6 newsపిల్లలు చదవకపోతే ఏ టీచరైనా ఏం చేస్తారు… వాళ్లు శ్రద్ధగా చదవడానికి కావలసినన్ని మార్గాలు వెతుకుతుంటారు. పిల్లల్ని నాలుగు మాటలు అంటారు. అప్పుడూ వినకపోతే రెండు దెబ్బలు వేస్తారు. అయితే గుజరాత్ లోని వడోదరలో ఓ టీచర్ డిఫరెంట్ స్టైల్లో వెళ్లాడు. గాజుపెంకులపై పిల్లలను నడిపించారు. పిల్లల్లో జ్ఞానం, ఏకాగ్రత పెరగడానికి అంటూ ట్యూషన్ పిల్లలందరితో వరుసపెట్టి నడిపించాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా… స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే… ఆ పిల్లలతో పాటే… తల్లిదండ్రులు కూడా నడవడం. పిల్లలంటే భయపడతారు అలా చేశారనుకున్నా… వాళ్ల తల్లిదండ్రుల కేమయ్యింది అనుకుంటున్నారు అంతా… దీన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy