ట్రంప్‌ని చంపేస్తే ఎలా ఉంటుంది..!

James-Comey-trumpఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని చంపేస్తే ఎలా ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జానీ డెప్‌. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న గ్లాస్టోన్‌బరీ ఫెస్టివల్‌కి వెళ్లాడు జానీ డెప్‌. ఈ ఫెస్టివల్‌లో జానీ డెప్‌ మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌.ఎఫ్‌ కెన్నడీని హత్య చేసిన నటుడు ఎవరు?’ అంటూ కెన్నడీని 1865లో హత్యచేసిన హాలీవుడ్‌ నటుడు జాన్‌బూత్‌ని గుర్తుచేశాడు ఈ సందర్భంగా జాన్‌డెప్‌.

జాన్‌డెప్‌ మాటల్ని స్థానిక మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో వైరల్‌గా మారింది. ఈమధ్యకాలంలో అమెరికాలో రిపబ్లికన్‌ రాజకీయ నేతలను దూషిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. గతవారం ఓ వ్యక్తి రిప్లబికన్‌ కాంగ్రెస్‌ నేతపై కాల్పులు జరపబోయాడు. మే నెలలో కేతీ గ్రిఫిన్‌ అనే వ్యాఖ్యాత రక్తపు మడుగుల్లో ఉన్న ట్రంప్‌ తల పట్టుకుంటున్నట్లు ఫొటోలకు పోజివ్వడం వివాదాస్పదమైంది. దాంతో ఆమె ట్రంప్‌కి బహిరంగంగా క్షమాపణ చెప్పింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy